FEATURES

atmeeyam
atmeeyam
తిరునల్లారు శనీశ్వరుడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యామాగ్రజం ; ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం . మందుడు , కోణుడు , పింగళుడు , శని అని పిలువబడుతూ గ్రహాలలో ఏడవది గా లేఖ్ఖించే శని గ్రహం గురించి తెలుసు కుందాం . మనం గ్రహాలగురించి తెలుసుకునే టప్పుడు ఆ గ్రహం శుభ గ్రహమా అశుభ గ్రహమా అన్నది తెలుసుకుంటూ వుంటాము . శుభగ్రహం అయితే అంతా మంచే జరుగుతుంది , అశుభ గ్రహం అయితే ఎప్పుడూ చెడు ఫలితాలనే యిస్తుంది అనే అపోహలో వుంటాం . కాని నిజానికి జాతక చక్రాన్ని బట్టి ఆయా గ్రహ స్థితిని బట్టి , ఆ గ్రహం వున్న రాశి ని బట్టి మంచి చెడు ఫలితాలు వుంటాయి . అందులో శనీశ్వరుని పేరు వినగానే ఏదో వినకూడని మాట విన్నట్టుగా వులిక్కి పడుతూ వుంటాము . శని మహాదశ పట్టబోతోంది అంటే ముందుగానే శనిగ్రహ శాంతికి ఏమేమి పూజలు చేయించాలో ఆలోచించు కుంటూ వుంటారు , అంటే శని గురించి ప్రజలలో వున్న భయం యే స్థాయిలో వుందో మనకి తెలుస్తుంది . కాని శని గురించి తెలుసు కుంటే మనకున్న అన్ని అపోహలు తొలగి పోతాయి . ప్రజలలో యింతటి భయాన్ని కలుగ జేసిన యీ శని భగవానుడు ఎవరు ? శని మహాదశ అంటే ఏమిటి ? శని మహాదశ లో కలిగే మంచి చెడుల గురించి తెలుసుకుందాం . శని సూర్యుడు , చాయాదేవిల పుత్రుడు . సూర్యునికి ఉషాదేవికి కలిగిన సంతతి యమున , యమధర్మ రాజులకి అన్న . నీలాదెవికి భర్త . నల్లని శరీర ఛాయా , ఎరుపు వర్ణం కలిగిన కళ్ళు , నీలి వస్త్రాలు ధరించి , విల్లంబులు ,త్రిశూలం ధరించి ఒకచేత్తో అభయ ముద్ర , కాకి ని వాహనంగా కలిగి వుంటాడు . శనిమహాదశ గురించి చాలా కధలు ప్రచారం లో వున్నాయి . వాటి ప్రకారం శని పట్టవలసిన సమయం వచ్చినప్పుడు ఎక్కడ దాగినా కూడా శని పట్టే తీరుతాడు అనేది అర్ధం అవుతుంది . మరి యీ కధలు నిజం గా పురాణాలలో వున్నాయో లేక కల్పిత కధలో తెలీదుగాని దీని వల్ల ప్రజలలో శనిగ్రహం అంటే వున్న అపోహలు మరింత పెరుగుతాయి అని మాత్రం చెప్పగలం . యీ మధ్య కాలంలో హిందూ జ్యోతిష్కులు శని గురించి దూరదర్శను ద్వారా , పుస్తకాలలో వ్యాసాల ద్వారా తెలియ జెయ్యడం వల్ల ప్రజలకు శని గ్రహం గురించి చాలా విషయాలు తెలిసాయి . image2.JPG శనిగ్రహానికి రాశి మారడానికి సుమారుగా 2 సంవత్సరాల 5 నెలలు పడుతుంది . శని నాలుగో రాశి లో వుంటే అర్ధాష్ఠమ శని , ఎనిమిదవ రాశిలో వుంటే అష్ఠమ శని అని , పన్నెండు , ఒకటి , రెండు రాశులలో వుంటే ఏలిననాటి శని అని , సాడేసత్తి ( ఏడున్నర సంవత్సరాలు ) అని ఉత్తరాది రాష్ట్రాలవారు అని అంటారు . యీ రాశులలో వున్నప్పుడు మనిషి జీవితం పై చెడు ప్రభావం పడుతుంది . కాబట్టి శనిగ్రహ శాంతి చేసుకోవాలి , శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసుకుంటే మంచి జరుగుతుంది అని అంటారు . యిక్కడ మనం తెలుసుకో వలసిన విషయం ఏమిటంటే స్తిరాస్తులు , వాహనాలు కొనుకోలు చెయ్యడానికి కారకుడు శని గ్రహమే . కార్య సిద్ధిని కలిగించేది కుడా యేలిననాటి శనే . అయితే శని గ్రహం మన పూర్వజన్మల పాప పుణ్యాలను , యీ జన్మలో మన కర్మ లను నిష్పక్షపాతం గా పరిశీలించి శిక్షలను నిర్ణయిస్తాడు . బతికుండగా అనుభవించవలసిన మంచి చెడు శిక్షలను అమలు పరిచేవాడు శని , మరణానంతరము మంచి చెడు శిక్షలను యముడు అమలు చేస్తాడు అని హిందూ గ్రంధాలలో వివరించేరు . అందుకనే శని గ్రహాన్ని కార్య సిద్దిని యిచ్చేవాడు , కార్యాలను పాడు చేసేవాడు అనికూడా అంటారు . శని గ్రహ ప్రభావ తీవ్రతని బట్టి శని హోమమ , శని జపం , శనికి తైలాభిషేకం చేయించుకోవాలి . యీ పూజలు యెక్కడ చేయించుకొవాలీ అంటే మందిరాలలో అదీ శనికి ప్రత్యేకంగా వున్న మందిరాలలో చేయించుకుంటే స్థల మహిమ వల్ల పదిరెట్ల ఫలితం పొందవచ్చని అంటారు . శని ని శనీస్వరుడు అనికూడా పిలుస్తారు . దానికి యీ క్రింది కధను చెప్తారు . శని మహాదశ పట్టబోతోందని తెలుసుకున్న యీశ్వరుడు శని నుంచి తప్పించుకోడానికి ఏడున్నర సంవత్సరాలు అడవిలో చెట్టు తొర్రలో దాక్కున్నాడుట , బయటకి వచ్చిన శివుని చూచి శని తన ప్రభావము వల్లనే శివుడు పార్వతిని , పరివారాన్ని వదిలి అడవుల పాలయినట్లు చెప్తాడు . శివుడు దానికి సమ్మతించి శనిపేరుతొ తన పేరుని కలిపి ఆ దినమునుండి అతడు శనీశ్వరుడు గా పిలువ బడతాడని ఆశీర్వదిస్తాడు . శనీశ్వరుడు యీశ్వరారాధన చేసుకొనే వారిపై తన ప్రభావం చాలా తక్కువగా వుంటుందని యీశ్వరునికి మాట యిస్తాడు . ముఖ్యమైన శని మందిరాలు యెక్కడెక్కడ వున్నాయో తెలుసుకుందాం . కొన్ని వేల సంవత్సరాల నుంచి భక్తుల పుజలందు కుంటున్న కొన్ని మందిరాలు యివి . 1) మందేశ్వరస్వామి మందపల్లి గ్రామం , కొత్తపేట మండలం , తూర్పు గోదావరి జిల్లా ఆంద్ర ప్రదేశ్ . 2) దర్భారణ్యెశ్వరుడు తిరునల్లారు గ్రామం కారైకాల్ జిల్లా పాండిచ్చేరి . 3) శనీశ్వరుడు బన్నంజె గ్రామం ఉడిపి కర్నాటక . 23 అడుగుల ఎత్తైన విగ్రహం . 4) శని శింగణాపూర్ , శింగణాపూర్ గ్రామం అహ్మద్ నగర్ జిల్లా మహారాష్ట్ర . 5) కోకిలావనం శని మందిరం నందగావ్ మథుర ఉత్తర ప్రదేశ్ . అయితే యీ మధ్య కాలంలో శని గురించి అవగాహన పెరగటం వలన ప్రతీ వీధి కి ఒకటి చొప్పున శని మందిరాలు , వాటిలో పూజలు అభిషేకాలు కుడా జరుగుతున్నాయి . వీటిలొ కూడా పూజలు , హోమాలు , తైలాభిషేకాలు చేయించు కోవచ్చు . యివాళ మనం తిరునల్లారు లో వున్న శని మందిరం గురించి తెలుసుకుందాం . తిరు అంటే శ్రీ , నల అంటే నలమహారాజు అరు అంటే విముక్తి అనిఅర్ధం . యీ ప్రదేశం లో నలమహారాజు శని ప్రభావం నుండి విముక్తి పొందేడు కాబట్టి యీ ప్రదేశం తిరునల్లారు అయిందని కొందరు అంటారు . యిక్కడ ఉత్తరాన ప్రవహిస్తున్న నూలారు , వచ్చియారు , దక్షిణాన ప్రవహిస్తున్న అరసలారు నదుల వలన యీ ఊరికి తిరునల్లారు అనే పేరు వచ్చిందని మరికొందరు అంటారు . చిదంబరానికి సుమారు 50 కిమీ.. సిరికాళి మీదుగా , కుంభకోణం నుంచి సుమారు 65కిమి .. మైలదుత్తరై మీదుగా చేరుకోవచ్చు . పాండిచ్చేరి లోని కారైకాల్ జిల్లా ముఖ్యపట్టణానికి ఏడు కిమీ... దూరం లో వుంది . యీ ఊరిలో అనేక తీర్థాలు వున్నాయి . కోవేలకి ఎదురుగా వున్న తీర్థం , కోవేలకి కుడు వైపున వున్న నల తీర్థమ్ చెప్పుకోదగ్గవి . image3.JPG పూర్వం కళింగరాజు కుటుంబం శాపవశాన అడవి యేనుగులుగా మారి అడవులలో తిరుగుతూ వుండగా వారిని చూసిన బృగు మహర్షి వారిపై దయతలచి యిక్కడి శనీశ్వరుని కోవెల ఎదురుగా వున్న తీర్ధంలో స్నానం చేసిన భక్తుల తలపైని నీరు వీరిమీద పడితే శాపవిముక్తులవుతారు అని చెప్తాడు . కళింగరాజు తన భార్య పుత్రులతో యీ తీర్ధం చుట్టూ తిరుగుతూ వుంటారు . అడవి ఏనుగలు తిరుగుతూ వుండడం తో భక్తులు భయం తో ఆ చుట్టు పక్కలకు రావడం మానివేస్తారు . కళింగ రాజు తమ ఆకారం చూచి భక్తులు భయపడుతున్నారని తెలుసుకొని చిన్న పందికొక్కుల రూపం ధరించి భక్తుల రాక కోసం ఎదురు చూస్తూ వుంటారు . వారి ఎదురుచూపు ఫలించి ఓ భక్తుడు స్నానం చేసి వచ్చి తల విదిలించగా ఆ నీరు కళింగ రాజు కుటుంబం మీద పడి వారు శాప విముక్తులౌతారు . యిప్పటికి యీ తీర్ధం స్వచ్చ మైన నీటితో ఆహ్లాదం గా వుంటుంది . భక్టులు భక్తి శ్రద్దలతో స్నానం చేస్తు వుంటారు . యీ తీర్ధమ్ నుంచి ఒక ఫర్లాంగు దూరం కోవేల వైపుగా వెళ్లి యెడమ వైపుకి తిరిగి కొద్ది దూరం వెళితే నల తీర్థమ్ వుంది . శని గ్రహ దోషం పోగొట్టుకో దల్చుకున్నవారు ఒంటికి నువ్వుల నూనె రాసుకొని యీతీర్ధం లో స్నానం చేసి పక్కనే వున్న వినాయకునికి కొబ్బరి కాయ సమర్పించుకొని పూజ చేసుకొని కోవేలలోని యీశ్వరుని దర్శించు కోవాలి . image4.JPG యీ కోవెల నల్లరాతి తో నిర్మించేరు . ఏడు అంతస్థుల రాజగోపురం దాటుకొని లోనికి వెళితే చాలా పెద్ద నాట్య మండపం అదిదాటు కొని వెళితే దర్భారణ్యెశ్వరుని దర్శించుకొని బయటికి వస్తే ఎడమ వైపు కోవెల గోడకి శని విగ్రహం వుంటుంది . శనిని దర్శించుకున్న తరువాత ఎడమ వైపున వున్న అమ్మవారిని దర్శించుకోవాలి . యిక్కడ పార్వతీ దేవి అత్తిరనాయకి , ప్రాణంబిక అనే పేరులతో పూజలందు కుంటోంది . అమ్మవారిని దర్శించుకున్న తరువాత బయట అంటే మండపం బయట నువ్వుల నూనే దీపాలు వెలిగిస్తారు . image5.GIF వినాయకుడు , వల్లి దేవసేన సమేత కుమారస్వామి , దక్షిణామూర్తి , నటరాజు , భైరవుడు , దుర్గ , గజలక్ష్మి , సంధికేశ్వరుడు మొదలైన దేవీ దేవతా మూర్తులు , రెండు నిలువుల ఎత్తు పెరిగిన స్థల వృక్షమైన దర్భ ను దర్శించుకోవచ్చు . యిక్కడ స్థల పురాణం ప్రకారం నలుడు ఏలిననాటి శని పట్టినపుడు రాజ్యాన్ని , భార్యా పుత్రులను , తన రూపాన్ని పోగొట్టుకొని , బికారిగా తిరుగుతూ యీ ప్రదేశం లోకి వచ్చి యిక్కడ తీర్థమ్ లో స్నానం చేసుకున్న తరువాత నలుడు తిరిగి తన రాజ్యాన్ని , భార్యాపుత్రులను , తన రూపాన్ని పొంది , మరి ఎప్పుడు ఏలిననాటి శని ప్రభావము తో బాధలు పడకుండా ఎన్నో సంవత్సరాలు ప్రజారంజకంగా పరిపాలన చేసేడుట . పాండ్య రాజుల కాలంలో జైనమతం ప్రాచ్ర్యం పొంది శైవం మరుగున పడిపోతున్నప్పుడు పరమశివ భక్తు డు , కవి అయిన జ్ఞానసంబందార్ యీ కోవెలలో 'పచ్చై పాతిగం ' రచించి , వాటిని పఠించి ప్రజలని జైన మతం నుంచి శైవం లోకి మళ్లించి , శైవ మతాన్ని రక్షించేడని చరిత్ర చెప్తోంది . శని గ్రహం అనుకూలం గా లేనప్పుడు యిక్కడి నల తీర్థం లో స్నానం చేసి శనిగ్రహానికి హోమాలు చేస్తే కొండంతగా జరగవలసిన నష్ఠమ్ గోరంతతో పోతుందని భక్తుల నమ్మకం . తిరునల్లార్ శని మందిరం లో ప్రతి శనివారం విశేష పూజలు , తైలాభిషేకాలు జరుగుతాయి . image6.JPG ప్రతి సంవత్సరం మే 14 వ తారీఖు నుంచి జూన్ 3 వ తరీఖు వరకు 18 రోజుల బ్రహ్మోత్సవాలు జరుపుతారు . పురటాసి పూర్ణిమ ( సెప్టెంబర్ - అక్టోబర్ ) , తమిళ , ఇంగ్లీష్ సంవత్సరాది , కార్తీక దీపం , దీపావళి , సంక్రాంతి పండగలలో విశేష అలంకరణ , విశేష పూజలు జరుగుతాయి . శని జయంతి , శని రాశి మారినప్పుడు , త్రయోదశికి , శుక్రవారాలు , ప్రదోషం సమయం లో శనికి హోమాలు , కాలసర్ప దోషానికి పరిహార హోమాలు పూజలు జరుపుతారు . శనిగ్రహ అనుగ్రహం లేకపోతే వాతం , శ్వాస సంబంధ జబ్బులు , ధనలేమి ,వ్యాపారం లో నష్ఠమ్ , కార్యాలలో జాప్యం , అవమానం , సంతాన లేమి , దీర్ఘ కాలిక జబ్బులు మొదలయిన వాటితో బాధలు కలుగుతాయి . శని గ్రాహం రాహు కేతులతో మిత్రత్వము , సూర్యుడు , చంద్రుడు , కుజులతో శత్రుత్వము , బృహస్పతి , శుక్రుడు , బుధుడు లతో సమ దృష్ఠి తో ఉంటాడు . పుష్యమి , అనురాధ , ఉత్తరా భాద్రలకి అధిపతి శని . శని గ్రహానికి యిష్ఠ మైనవి -- రంగు -- నీలమ్ , రత్నం యింద్ర నీలం ( బ్లూ సఫైర్ ) , దిక్కు పడమర , ధాన్యం నల్ల నువ్వులు , తత్వం వాయు . శని కృపకి పాత్రులవాలంటే శనివార నాడు శనికి నల్ల బట్ట , నువ్వులు , నువ్వుల నూనే సమర్పించాలి . శని మూల మంత్రం --- ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయనమః శని గాయత్రి ----- ఓం శనైశ్చరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాతు